వెలుతురు కళ్లల్లో గుచ్చుకుంటుంటే ఇక తప్పదన్నట్టుగా కాసేపు అటూ ఇటూ దొర్లి, బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ, కప్పుకున్న దుప్పటిని ఒంటి మీద నుంచి తొలగిస్తూ లేచి కూర్చున్నాను.
ఎదురుగా నేను, మా శ్రీ వారు ఉన్న ఫొటోలో.. తను నన్ను వెనకనుంచి పట్టుకుని ఉంటే మేమిద్దరం మా 64 (32+32) పళ్లన్నీ కనబడేట్టు ఇకిలిస్తున్న ఫోజులో ఉన్నాం. శ్రీవారికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి.. శనివారం పొద్దున్న నా పక్కన (లో)లేని తనని ముద్దుగా విసుక్కుంటూ మంచమ్మీదనుంచి దిగి బాత్రూములోకి అడుగుపెట్టాను.
**
నేను (అంటే శ్వేత), హబ్బీ సాగర్.. ఇద్దరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లం. పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది. సాగర్ తన ప్రాజెక్ట్ వర్క్ మీద US వెళ్లి సుమారు 3 నెలలు కావస్తోంది. తను తిరిగి రావడానికి ఎట్లాలేదన్నా ఇం కా 3 నెలలు పట్టొచ్చు. భార్యా భర్తలిద్దరూ work చేసే వాళ్లయితే ఇట్లాంటి ఇబ్బందులు తప్పవనుకుంటా!. లేక పోతే శుభ్రంగా నేను కూడా సాగర్ తో పాటు వెళ్లి ఉండేదాన్ని కదా!..
**
సన్నగా నిట్టూరుస్తూ బాత్రూములోంచి బయట కొచ్చి గడియారం వంక చూసాను పది దాటొస్తోంది. బయట కొచ్చి
ఎదురు అపార్టుమెంట్లో పిన్నిగారు ఇవ్వాళ టిఫిను, భోజనం అన్నీ వాళ్లింట్లోనే అన్న విషయం గుర్తుకొచ్చి “♡..” అను కుంటూ టవల్ అందుకుని మళ్లీ బాత్రూములోకి దూరాను
మా ఇద్దరి సేవింగ్సుతోపాటు, కొంత బాంకులో లోనుతో మేము ఈ అపార్టుమెంటు కొనుక్కుని గృహప్రవేశం అయ్యే నాటికే మా ఎదురు అపార్టుమెంట్లో పిన్నిగారు వాళ్లు ఉంటున్నారు. బాబాయిగారు బ్యాంకులో మానేజరు. ఇంకా
2,3 ఏళ్ల సర్వీసు ఉందన్నట్టు గుర్తు. వాళ్లకి ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసేసి అత్తవారిళ్లకి పంపేసి, వీళ్లిద్దరూ మళ్లీ లైఫ్ ని.. కొత్తగా పెళ్లయిన వాళ్ల లా enjoy చేస్తున్నారు. నాకు అప్పుడప్పుడూ, మేము కూడా అలా ఉండట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది.
వచ్చిన కొద్ది రోజులకే వాళ్లిద్దరూ మాకు బాగా సన్నిహితులయ్యారు. బాబాయి గారు, మా హోం లోన్ ని వాళ్ల బాంకులోకి తక్కువ వడ్డీకి మార్పించారు. మేమిద్దరం ఎప్పుడన్నా అలసిపోయి ఇంటికి చేరుకుని వండుకునే ఓపికలేని సమయాల్లో వాళ్లింటినుంచి మాకు కూరలో, టిఫినో, లేకపోతే వాళ్లింట్లోనే భోజనమో సిద్ధంగా ఉండేవి.
సరే, విషయాని కొస్తే..
ఏమైనా సరే, వీకెండ్లో ఆఫీసు మొహం చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్న నేను రాత్రి ఆఫీసులో కాస్త లేటుగా ఉండి, బిజీ బిజీగా ఉన్న సమయంలో, పిన్నిగారు ఫోను చేసి రేపు బాబాయిగారి పుట్టిన రోజనీ, అందువల్ల ఇంట్లో వంటే మీ పెట్టుకోవద్దనీ, వాళ్లింట్లోనే భోజన మనీ చెప్పి ఫోన్ పెట్టేసారు.
“హమ్మయ్య!. ఐతే రేపటికి పిన్నిగారింట్లో విస్తరాకులు ఇచ్చేసినట్టే!..” అను కుంటూ మళ్లీ పనిలో పడ్డాను.
**
***
బాత్రూములోంచి బయట కొచ్చి తల తుడుచుకుంటూ మళ్లీ టైము వంక చూసాను. మళ్లీ ఇంకోసారి “అమ్మో!..” “మరీ భోజనం టైము కి వెళ్తే ఏంబా వుంటుందుంది?..” అనుకుంటూ ఇంకా నీళ్లు కారుతున్న జుట్టుని జారుముడిలో బిగించి, పెద్దవాళ్ల దగ్గరకెళ్లేటప్పుడు సల్వార్ కమీజ్ ఎందుకులే అని, తొందరగా చీర జాకెట్ వేసుకుని మా అపార్టుమెంటుకి తాళంవేసి, పిన్నిగారి అపార్టుమెంట్ కాలింగ్ బెల్ నొక్కబోతూ మళ్లీ వెనక్కి వెళ్లి నిన్న బాబాయిగారి కోసం కొన్న గ్రీటింగ్ కార్డు, స్వీట్ ప్యాకెట్టు తీసుకొచ్చి కాలింగ్ బెల్ ని నొక్కాను.
తలుపు తీసిన పిన్నిగారు “రా అమ్మాయ్! రా!” అంటూ తలుపు వేసి నా చెయ్యి పట్టుకుని లోపలకి నడిపించుకుని వెళ్లారు.
హాల్లో చుట్టూ పరికించి చూస్తూ, “బాబాయి గారి బ్యాంకుకి వెళ్లి పోయారా?. కొద్దిగా ముందు రావాల్సింది?..” అని నా చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డు పైకెత్తి చూపిస్తూ, నా తలమీద చిన్నగా మొత్తుకుని “.. రాత్రి టీవీలో ఏదో సినిమా చూస్తూ ఉండిపోయాను.. దానితో పొద్దున లేచేసరికి..” అంటున్న నన్ను నెమ్మది గా మట్లాడమన్నట్టుగా సైగ చేసారు పిన్నిగారు. ఏ మిట న్నట్టు గా ప్రశ్నార్ధకంగా చూసాను నేను.
ఆమె వాళ్ల బెడ్రూము దగ్గరకెళ్లి లోపలకి ఒకసారి తొంగి చూసి, తలుపుని దగ్గరగా లాగి నా దగ్గర కొచ్చి, “మీ బాబాయి గారు.. నిన్నటి నుంచీ చెపుతుంటే నా పోరు పడలేక.. మొత్తానికి ఇవాళికి సెలవుపెట్టారు. కాసేపు పడుకుంటానని వెళ్లి పడుకుని ఒక పది నిమిషాలయింది..” అన్నారు దీవాను మీద నా పక్కన కూర్చుంటూ.
“పోనీలెండి పిన్నిగారు.. బ్యాంకుకెళ్తే రెస్టు ఎలాగూ ఉండదు కదా.. ఇవ్వాళైన కాస్త రెస్టు తీసుకుంటార్లెండి” అన్నాను.
“కరక్టే.. అదీ కాక మన ఆడాళ్ల మాటల మధ్యలో ఆయనెందుకులే..” చిన్నగా నవ్వుతూ నా దగ్గరకి జరిగి నా చేతులని ఆమె చేతిలోకి తీసుకున్నారు.
ఆమె అన్నది ఏమిటో అర్ధం కాకపోయినా నేను కూడా చిన్నగా నవ్వి ఊరుకున్నాను.
“మీ ఆయన ఫోను చేస్తున్నాడా?” అడిగింది ఆమె నా అరచేతిలో ఆమె అరచేత్తో రాస్తూ.
“ఆ! మొన్న చేసారు. మళ్లీ రేపు చేస్తారేమో!” అన్నాను.
“బాగా మిస్సవుతూ ఉండి ఉంటావు కదూ మీ ఆయన్ని..?”.
ఏమనాలో తెలియక తలవంచుకుని “ఔను” అన్నట్టుగా తల ఆడించాను.
“ఔనులే మరి.. ఒకటా రెండా.. ఎన్ని మిస్సవుతున్నవ్.. సినిమాలు, షికార్లు.. బైకుల మీద హత్తుకుని, ఒత్తుకోవడాలు.. ఇంక బెడ్రూము భాగోతాలు సరే సరి..” అన్నారావిడ చిలిపిగా.
“ఊరుకోండి పిన్నిగారు.. మీరు మరీను..” అన్నాను నేను తలని పూర్తిగా దించేసుకుని.
(అప్పుడుగనక సాగర్ అక్కడ ఉన్నట్టయితే ఎర్రగా కంది పోయిన నా మొహాన్ని చూసి నన్ను ఇంకా ఏడిపిస్తూ ఉండేవాడు.)
ఇంకా ఉంది.
88221cookie-checkశ్రీమతి.. ఒక బహుమతి 1 వ భాగం